క్యాలెండర్లతోపాటు వివిధ వస్తువులను ఫ్లవర్ టెక్నాలజీతో తయారు చేయిచడానికి డాక్టర్ వైఎస్‌ఆర్ ఉద్యాన వర్సిటీతో ఈనెల 13న ఎంవోయూ కుదుర్చుకుంటామని తితిదే ఈవో జవహర్‌రెడ్డి తెలిపారు. తిరుపతి శ్రీ పద్మావతి విశ్రాంతి భవనంలో శుక్రవారం ఉద్యాన వర్సిటీ ఉపకులపతి డాక్టర్ టి.జానకిరామ్, ఇతర అధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ.. ఉద్యాన వర్సిటీలోని సిట్రాస్ రీసెర్చ్ స్టేషన్‌కు రూ.83 లక్షలు సమకూర్చామని తెలిపారు. ఇక్కడ ఆధునిక సాంకేతిక వినియోగించి ఫోటోలతో పాటు ఇతర వస్తువులు తయారు చేసేందుకు మహిళలకు ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు.
TTD: ఫ్లవర్ టెక్నాలజీతో తితిదే క్యాలెండర్లు - ఏపీ టాప్ న్యూస్
తితిదే పరిధిలోని ఆలయాల్లో ఉపయోగించిన పూలతో స్వామి, అమ్మవార్ల ఫోటోలు, క్యాలెండర్లు, కీ చైన్లు, పేపర్ వెయిట్లు తదితరాలు తయారు చేయడానికి వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయంతో ఈ నెల 13న ఒప్పందం చేసుకోనున్నట్లు తితిదే ఈఓ జవహర్‌రెడ్డి తెలిపారు.
ఫ్లవర్ టెక్నాలజీతో తితిదే క్యాలెండర్లు
దీనికి ప్రతిగా స్వామివారి ఫొటోలతోపాటు క్యాలెండర్లు, కీచైన్లు, పేపర్ వెయిట్లు, రాఖీలు, డ్రైఫ్లవర్ మాలలను తయారు చేసి తితిదేకి ఇస్తారన్నారు. వీటిని భక్తులకు విక్రయిస్తామన్నారు. సమావేశంలో తితిదే, వర్సిటీలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:HIGH COURT: తల్లుల ఖాతాల్లో బోధన రుసుములా!