ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'వీఐపీ దర్శనాలు రద్దు' వ్యాజ్యాన్ని స్వీకరించిన హైకోర్టు

తిరుమల తిరుపతి దేవస్థానంలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేయాలని కోరుతూ.. వేసని వ్యాజ్యాన్ని హైకోర్టు విచారణకు స్వీకరించింది.

By

Published : Apr 3, 2019, 9:54 AM IST

ఏపీ హైకోర్టు

తిరుమల తిరుపతి దేవస్థానంలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేయాలని కోరుతూ ప్రకాశం జిల్లాకు చెందిన సుబ్బారావు అనే వ్యక్తి హైకోర్టులో వ్యాజ్యం వేశారు. ఆ వ్యాజ్యాన్ని ఏపీ హైకోర్టు విచారణకు స్వీకరించింది. పిటిషనర్ తరఫున న్యాయవాది వాదనలు వినిపించారు. వీఐపీ దర్శనాలు కారణంగా సామాన్య భక్తులు ఇబ్బంది పడుతున్నారని వాదించారు. వాదనలు విన్న కోర్టు కేసును వారం రోజులకు వాయిదా వేసింది.

ABOUT THE AUTHOR

...view details