ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తిరుమలలో పాములుపట్టే వ్యక్తికి గౌరవ వేతనం నిలిపివేత - tirumala snakes latest news

తిరుమల కొండపై పాములు భక్తులను భయభ్రాంతులకు గురిచేస్తుంటాయి. పాములను పట్టుకోవటానికి ఇన్నాళ్లు తితిదే ఒక ఉద్యోగిని ఏర్పాటు చేసి అతనికి గౌరవ వేతనం ఇస్తూ వచ్చింది. తాజాగా పాములు పట్టే భాస్కర్ నాయుడికి గౌరవ వేతనం తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

TTD  take decision   to cut the  Pay of Honor to snake taker in tirumala
TTD take decision to cut the Pay of Honor to snake taker in tirumala

By

Published : May 31, 2020, 12:22 AM IST

తిరుమలలో పాములు పట్టే భాస్కర్ నాయుడికి ఇకపై గౌరవ వేతనం నిలిపివేయాలని తితిదే అధికారులు నిర్ణయం తీసుకున్నారు. తితిదే ఉద్యోగిగా ఉన్న ఆయన 2016లో పదవీ విరమణ పొందారు. తిరుమలలో నిత్యం భక్త సంచారంలోకి పాములు వస్తుండటంతో వారికి రక్షణ కల్పించటం కోసం... పాములు పట్టడంలో నేర్పరి అయిన ఆయనకు 20వేల గౌరవ వేతనం ఇస్తూ ఉద్యోగ బాధ్యతలు అప్పగించారు. తాజాగా అధికారులు తీసుకున్న నిర్ణయంతో గౌరవ వేతనం బదులు పాముకు వేయి రూపాయలు ఇవ్వాలని నిర్ణయించారు.

ABOUT THE AUTHOR

...view details