ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వెంకటేశుని నివాసం... ప్లాస్టిక్​ రహితం... - plastic free procedures at tirumala

కలియుగ ప్రత్యక్ష దేవుని నిలయమైన శ్రీవారి నివాసాన్ని ప్లాస్టిక్​ రహితంగా తీర్చిదిద్దేలా తితిదే చర్యలు విస్తృతం చేసింది. తిరుమల వ్యాప్తంగా కాలుష్య కారకాలను నిషేధించే దిశగా ప్రణాళికలు రచిస్తోంది. వచ్చే సంక్రాంతి నుంచి ప్లాస్టిక్​ సీసాలను పూర్తిగా నిషేధించనుంది. భక్తులు ప్లాస్టిక్​ వాడకుండా అవగాహన కల్పించడం సహా ప్రత్యామ్నాయాలను అందుబాటులోకి తీసుకువచ్చింది.

వెంకటేశుని నివాసం... ప్లాస్టిక్​ రహితం...

By

Published : Nov 25, 2019, 5:23 AM IST

Updated : Nov 25, 2019, 6:42 AM IST

ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుమల సంపూర్ణ స్వచ్ఛతను క్రమేణా సాధిస్తోంది. స్వామి వారు కొలువైన తిరుమల వ్యాప్తంగా కాలుష్య కారకాలను నిషేధించే దిశగా తితిదే చర్యలు చేపట్టింది. వచ్చే సంక్రాంతి నుంచి మంచి నీటి ప్లాస్టిక్​ సీసాలను నిషేధించనుంది. నిత్యం తిరుమలకు వచ్చే లక్షమంది భక్తులతో పాటు స్థానికులు, వ్యాపారుల దైనందిన కార్యకలాపాల వల్ల పెద్ద ఎత్తున తడి, పొడి చెత్త పోగవుతోంది. రోజుకు సగటున 5.40 టన్నుల చెత్త ఉత్పత్తవుతోంది. ఇందులో 20 టన్నులు ప్లాస్టిక్​ కాగా.. 10 టన్నుల గ్లాస్​ సీసాలు, 28 టన్నుల వరకూ చెప్పులు కూడా ఉన్నట్లు అధికారుల పరిశీలనలో తేలింది. మెటల్​, సిరామిక్​, కార్డుబోర్డు, ఆహార వ్యర్థాలు, పూలు, జీవ, భవన వ్యర్థాలు కూడా ఉంటున్నాయి. వీటిలో నష్ట కారక వ్యర్థాలను నియంత్రించడం సహా మిగిలిన వాటి పునర్వినియోగంపై అధికారులు దృష్టి సారిస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ప్లాస్టిక్​ సీసాల్లో నీటిని ఎక్కువగా వినియోగిస్తున్నారు. దీనికి ప్రత్యామ్నాయంగా అడుగడుగునా జల ప్రసాద వాటర్​ ఫిల్టర్​ కేంద్రాలను ప్రారంభిస్తూ భక్తులు ఈ నీటినే తాగేలా తితిదే చైతన్య పరుస్తోంది.

కార్యాచరణ ఇదీ

  • శ్రీవారి లడ్డూ ప్రసాదం కౌంటర్ల వద్ద ప్లాస్టిక్​కు బదులు జనపనార కవర్ల వాడకం.
  • ప్లాస్టిక్​ నీళ్ల సీసాల స్థానంలో అందుబాటులోకి రాగి, స్టీల్​ సీసాలు తీసుకురావడం.
  • యాత్రికుల వసతి సముదాయాల్లో జలశుద్ధి కేంద్రాల ఏర్పాటు.
  • తితిదే కార్యాలయాల్లో మట్టికుండలు, పునర్వినియోగ డబ్బాల వాడకం.
  • తిరుమలలో వ్యర్థాల శుద్ధి ప్రక్రియకు సేంద్రియ పదార్థాల వాడకం.
Last Updated : Nov 25, 2019, 6:42 AM IST

ABOUT THE AUTHOR

...view details