చిత్తూరు జిల్లా చంద్రగిరి శ్రీ మూలస్థాన ఎల్లమ్మకు సారె కార్యక్రమం జరిగింది. ఈ సారెను తిరుమల శ్రీవారి ఆలయం నుంచి తీసుకువచ్చారు. అమ్మవారికి సమర్పించాల్సిన వస్త్రాలను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి శ్రీకోదండరామస్వామి ఆలయంలో ఉంచి పూజలు చేశారు. అనంతరం శేషవస్త్రాలు, పసుపు, కుంకుమ, మంగళద్రవ్యాలతో కూడిన సారెను మేళావాయిద్యాల మధ్య ఊరేగింపుగా అమ్మవారికి సమర్పించారు. ప్రతి ఏటా సంక్రాంతి పురస్కరించుకుని అమ్మవారికి తితిదే సారె సమర్పించటం ఆనవాయితీగా వస్తుందని భాస్కర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
చంద్రగిరి ఎల్లమ్మకు తితిదే సారె - chandragiri ammavari sare to send ttd
సంక్రాంతి మహోత్సవాల్లో భాగంగా చంద్రగిరి శ్రీమూలస్థాన అమ్మవారికి...తిరుమల నుంచి వచ్చిన సారెను.. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఊరేగింపుగా తీసుకువచ్చి సమర్పించారు.
చంద్రగిరిలోని ఎల్లమ్మకు తితిదే సారె సమర్పణ