ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఈనెల 15న యథావిధిగా గోపూజ నిర్వహిస్తాం' - ttd review on kamadenu pooja

జనవరి 15న తెలుగు రాష్ట్రాల్లో యథావిధిగా గోపూజ జరుగుతుందని.. తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి స్పష్టం చేశారు. కామధేనుపూజ ఏర్పాట్లపై ఆయన సమీక్ష నిర్వహించారు.

ttd review on kamadenu pooja
తితిదే సమీక్ష

By

Published : Jan 12, 2021, 10:12 AM IST

ధ‌ర్మ ‌ప్ర‌చారంలో భాగంగా జ‌న‌వ‌రి 15న గుంటూరు జిల్లా న‌ర‌స‌రావుపేటలో కామ‌ధేనుపూజ నిర్వ‌హించ‌నున్న‌ట్టు తితిదే అద‌న‌పు ఈవో ధ‌ర్మారెడ్డి ప్రకటించారు. తిరుపతిలోని శ్రీ ప‌ద్మావ‌తి విశ్రాంతి గృహంలో కామ‌ధేనుపూజ ఏర్పాట్ల‌పై సోమ‌వారం సమీక్ష నిర్వహించారు. శ్రీ వేంకటేశ్వ‌ర వేద విశ్వ‌విద్యాల‌యం ఉప‌కుల‌ప‌తి, ఇత‌ర పండితుల ఆధ్వ‌ర్యంలో ఈ కార్య‌క్ర‌మం నిర్వ‌హించాల‌న్నారు.

అవసరమైన పూజాసామగ్రి, వసతుల‌ను ముందుగా సిద్ధం చేసుకోవాల‌ని సూచించారు. హిందూ ధ‌ర్మ‌ప్ర‌చార ప‌రిష‌త్ ద్వారా జ‌న‌వ‌రి 15న తెలుగు రాష్ట్రాల్లో గోపూజ య‌థావిధిగా జ‌రుగుతుందని చెప్పారు. గోపూజ ప్రాశ‌స్త్యంపై ఎస్వీబీసీ ఆధ్వ‌ర్యంలో డాక్యుమెంట‌రీ రూపొందించాల‌ని ఆదేశించారు. కామ‌ధేనుపూజకు సంబంధించి అన్ని విభాగాల అధికారులు భాగస్వాములు కావాలన్నారు.

ABOUT THE AUTHOR

...view details