నిన్న శ్రీవారిని 28,472 మంది భక్తులు దర్శించుకున్నారు. 10,732 మంది భక్తులు శ్రీనివాసునికి తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 2.01 కోట్ల రూపాయలు వచ్చినట్లు తితిదే ప్రకటించింది.
సర్వదర్శనం టోకెన్లను నిలిపివేసిన తితిదే - తిరుమల శ్రీవారి దర్శన టికెట్లు తాజా సమాచారం
కరోనా తీవ్రత దృష్ట్య పరిమిత సంఖ్యలో భక్తులకు అనుమతివ్వనున్నట్ల తితిదే వెల్లడింది. ఈ క్రమంలో సర్వదర్శన టికెట్లను నిలిపివేసినట్లు ప్రకటించింది.
తిరుమల
కొవిడ్ కేసులు పెరుగుతున్న కారణంగా భక్తులను పరిమిత సంఖ్యలో అనుమతిస్తున్నట్లు తితిదే స్పష్టం చేసింది. టైంస్లాట్లో సర్వదర్శనం టోకెన్ల జారీని నిలిపివేసింది. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల భక్తులకే తిరుమలకు అనుమతివ్వనున్నారు. అలిపిరి వద్ద దర్శన టికెట్లను పరిశీలించి తిరుమలకు అనుమతిస్తున్న తితిదే స్పష్టం చేసింది.
ఇదీ చదవండీ..దుర్గామల్లేశ్వరస్వామి రథంపై తాత్కాలికంగా వెండి సింహాల ఏర్పాటు