కొవిడ్ కారణంగా మూసి వేసిన శ్రీ వారి మెట్ల మార్గాన్ని తితిదే ఈ రోజు నుంచి తిరిగి ప్రారంభించింది. ఉదయం 6గంటల నుంచి సాయంత్రం 4గంటలవరకూ మాత్రమే భక్తులను ఈ మార్గం ద్వారా తిరుమల చేరుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు తితిదే ఈవో జవహర్ రెడ్డి తెలిపారు. అలిపిరి కాలినడక మార్గంలో పైకప్పు పనులు జరుగుతుండటంతో మధ్యాహ్నం రెండు గంటల వరకే ఆ మార్గాన్ని తెరిచి ఉంచుతామని అన్నారు. మొక్కులున్న భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న దృష్ట్యా శ్రీవారి మెట్టు మార్గాన్ని ప్రారంభిస్తున్నట్లు ఈవో స్పష్టం చేశారు.
శ్రీ వారి మెట్ల మార్గం తిరిగి ప్రారంభం
కరోనా మహమ్మారి ప్రభావంతో నిలిపివేసిన శ్రీ వారి మెట్ల మార్గం తిరిగి నేటి నుంచి ప్రారంభం అయింది.మొక్కులున్న భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న దృష్ట్యా ఈ మార్గానికి అనుమతి ఇచ్చినట్లు తితిదే ఈవో జవహర్ రెడ్డి స్పష్టం చేశారు.
శ్రీ వారి మెట్ల మార్గం తిరిగి ప్రారంభం