అక్టోబర్ నెల టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేసినట్లు తితిదే ( Tirumala Tirupathi Devasthanam ) అదనపు ఈవో (Additional EO) ధర్మారెడ్డి తెలిపారు. టికెట్లు సంఖ్య తగ్గటం, టికెట్లు బుక్ చేసుకునే వారి సంఖ్య పెరగడంతో సర్వర్లపై ఒత్తిడి పెరిగి సమస్యలు తలెత్తాయని ఆయన అన్నారు. ఒక స్లాట్‌లో టికెట్ల కోసం ఒకేసారి 6 లక్షల మంది ప్రయత్నించారన్నారు. 2.40 లక్షల టికెట్ల కోసం కోటి మంది భక్తులు ప్రయత్నించారని వివరించారు. సర్వర్ల కోసం కంట్రోల్ ఎస్ సంస్థతో గతేడాది రూ.60 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు ధర్మారెడ్డి స్పష్టం చేశారు. జనవరి నుంచి ఏపీటీఎస్ సర్వర్ ద్వారా టికెట్లను విడుదల చేశామన్నారు. ఏపీటీఎస్ (APTS) ద్వారానూ సమస్యలు పునరావృత్తమవుతున్నాయని తితిదే అదనపు ఈవో తెలిపారు. క్లౌడ్ మేనేజ్‌మెంట్ ద్వారా టికెట్ల (Tickets)విడుదలకు నిర్ణయించామని ఆయన అన్నారు. జియో సంస్థ (Jio) సహకారంతో టికెట్లు విడుదల చేసినట్లు వివరించారు. జియో సంస్థ ఉచితంగా సేవలందిస్తోందని తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి తెలిపారు.
TTD: అక్టోబర్ నెల టికెట్లు.. ఆన్‌లైన్‌లో విడుదల చేసిన తితిదే - తిరుమల సేవా టిక్కెట్లు
అక్టోబర్ నెల టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేసినట్లు తితిదే ( Tirumala Tirupathi Devasthanam ) అదనపు ఈవో (Additional EO)ధర్మారెడ్డి తెలిపారు. టికెట్లు సంఖ్య తగ్గటం, బుక్ చేసుకునే వారి సంఖ్య పెరడంతో సర్వర్లపై ఒత్తిడి పెరిగి సమస్యలు తలెత్తాయని ఆయన అన్నారు.

అక్టోబర్ నెల టికెట్లు.. ఆన్‌లైన్‌లో విడుదల చేసిన తితిదే