ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

TIRUMALA: నవంబర్​లో తిరుమల శ్రీవారి ఆలయంలో ఏం జరగనుందో తెలుసా? - తిరుపతి తాజా వార్తలు

నవంబర్ నెలలో తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రధానంగా నిర్వహించనున్న ఉత్సవాలు, ప‌ర్వ‌దినాల వివరాలను తితిదే విడుదల చేసింది.

TTD RELEASED NOVEMBER MONTH SPECIAL DAYS LIST
నవంబర్​లో తిరుమల శ్రీవారి ఆలయంలో ఏం జరగబోతోందో తెలుసా?

By

Published : Oct 27, 2021, 1:08 PM IST

తిరుమల శ్రీ‌వారి ఆల‌యంలో నవంబర్ నెలలో నిర్వహించనున్న విశేష ఉత్సవాలు, ప‌ర్వ‌దినాల వివరాలను తితిదే విడుదల చేసింది. ఇందులో ప్రధానంగా దీపావ‌ళి ఆస్థానం, నాగుల‌చ‌వితి సంద‌ర్భంగా పెద్ద‌శేష వాహ‌నసేవ, పుష్పయాగం, కార్తీక దీపోత్స‌వం వంటి ఉత్యవాలను నిర్వహించనున్నారు. నవంబర్ నెల విశేష ఉత్స‌వాల వివ‌రాలు ఇలా ఉన్నాయి.

  • న‌వంబ‌రు 1న మ‌త‌త్ర‌య ఏకాద‌శి
  • న‌వంబ‌రు 4న దీపావ‌ళి ఆస్థానం
  • న‌వంబ‌రు 6న శ్రీ తిరుమ‌ల‌నంబి శాత్తుమొర‌
  • న‌వంబ‌రు 8న నాగుల‌చ‌వితి సంద‌ర్భంగా పెద్ద‌శేష వాహ‌నసేవ‌, శ్రీ మ‌న‌వాళ మ‌హాముని శాత్తుమొర‌
  • న‌వంబ‌రు 10న పుష్ప‌యాగానికి అంకురార్ప‌ణ‌
  • ‌వంబ‌రు 11న పుష్ప‌యాగం, శ్రీ వేదాంత దేశికుల శాత్తుమొర‌
  • ‌వంబ‌రు 16న కైశిక ద్వాద‌శి ఆస్థానం, చాతుర్మాస్య వ్ర‌తం స‌మాప్తి
  • న‌వంబ‌రు 18న కృత్తికా దీపోత్స‌వం
  • న‌వంబ‌రు 19న శ్రీ తిరుమంగైయాళ్వార్ శాత్తుమొర‌

ABOUT THE AUTHOR

...view details