ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తితిదే రీఫండ్ గడువు పొడగింపు - ttd Refund Deadline Extension news

లాక్‌డౌన్‌లో శ్రీ‌వారి ఆర్జిత సేవ‌లు, ద‌ర్శ‌న టికెట్లు, వ‌స‌తి బుక్ చేసుకున్న భ‌క్తులకు తితిదే రీఫండ్​ను అందిస్తోంది. డిసెంబరు 31 వరకు అవకాశాన్ని కల్పించింది.

ttd Refund Deadline Extension
తితిదే రీఫండ్ గడువు పొడగింపు

By

Published : Oct 28, 2020, 7:01 PM IST

లాక్​డౌన్​లో శ్రీవారి టికెట్లు బుక్ చేసి రద్దు చేసుకున్న భక్తులకు తితిదే ..డబ్బులను రీఫండ్ చేస్తుంది. మార్చి 13 నుంచి జూన్ 30వ తేదీ వ‌ర‌కు ఆన్‌లైన్, పోస్టాఫీసు, ఈ-ద‌ర్శ‌న్, ఏపీ ఆన్​లైన్ కౌంట‌ర్ల ద్వారా శ్రీ‌వారి ఆర్జిత సేవ‌లు, రూ.300/- ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌న టికెట్లు, వ‌స‌తి గదులను బుక్ చేసుకున్న భ‌క్తులు వాటిని రద్దు చేసుకుంటే ఆ మొత్తాన్నితితిదే తిరిగి అందిస్తోంది. వాటి గడువును డిసెంబరు 31 వరకు పొడిగించినట్లు తితిదే ప్రకటించింది.

పోస్టాఫీసు, ఈ-దర్శన్ కౌంటర్లు, ఎపి ఆన్ లైన్ కౌంట‌ర్ల ద్వారా బుక్ చేసుకున్న భ‌క్తులు సంబంధిత టికెట్ వివ‌రాల‌తోపాటు, బ్యాంకు ఖాతా నంబ‌రు, ఐఎఫ్ఎస్‌సీ కోడ్ వివ‌రాల‌ను refunddesk_1@tirumala.org మెయిల్ ఐడికి పంపాల‌ని తితిదే ప్రకటించింది. మెయిల్ వివ‌రాలను ప‌రిశీలించిన అనంత‌రం మొత్తాన్ని నేరుగా భ‌క్తుల ఖాతాల్లోకి జ‌మ చేయనున్నట్లు ప్రకటలో తెలిపింది.

టికెట్లు రద్దు చేసుకుని రీఫండ్ పొందడానికి ఇష్టపడని భక్తులు డిసెంబరు 31వ తేదీలోపు వారికి అనువైన తేదీల్లో ఆ టికెట్లు చూపి శ్రీవారి దర్శనం చేసుకోవచ్చని తెలిపింది. మరో వైపు 2021 డైరీలు, క్యాలెండ‌ర్లు ఆన్‌లైన్‌లో బుకింగ్‌కు అవ‌కాశం కల్పించినట్లు తెలిపారు.‌ tirupatibalaji.ap.gov.in ద్వారా బుక్ చేసుకునేందుకు అవ‌కాశం క‌ల్పించింది.

ఇదీ చూడండి:

రైతులకు కనీస మద్దతు ధర కచ్చితంగా ఇవ్వాలి: సీఎం జగన్

ABOUT THE AUTHOR

...view details