కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేలా తిరుమలలో తితిదే జాగ్రత్తలు తీసుకుంటుంది. థర్మల్ స్కానింగ్ ద్వారా భక్తులకు పరీక్షలు చేస్తున్నారు. అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద నుంచి తిరుమల కొండపైకి వెళ్లే మార్గంతో పాటు.. ఆలయ పరిసర ప్రాంతాలను నిత్యం రసాయనాలతో శుద్ధిపరుస్తున్నారు. కంపార్ట్‌మెంట్లలో భక్తులు గుంపుగా ఉండేందుకు ఆస్కారం ఇవ్వకుండా టైం స్లాట్ విధానం ద్వారా శ్రీవారి దర్శనం కల్పించేందుకు చర్యలు ప్రారంభించారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆరోగ్యవంతులుగా ఉండాలని ఆకాంక్షిస్తూ... లోక కల్యాణం కోసం తితిదే పలు యాగాలను నిర్వహిస్తోంది.
కరోనా కట్టడికి తితిదే చర్యలు
శ్రీవారి సన్నిధిలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేలా తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. అలిపిరి తనిఖీ కేంద్రం నుంచి తిరుమల కొండపైకి వెళ్లే మార్గంతోపాటు.. ఆలయ పరిసరాల్లో నిత్యం రసాయనాలతో శుభ్రం చేస్తున్నారు.
కరోనా కట్టడికి తితిదే చర్యలు