ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తిరుమల కనుమ దారిలో ప్రయాణం...ఆ పత్రాలు తప్పనిసరి

తిరుమల ఘాట్ రోడ్డులో ప్రయాణించే వారు నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని తిరుమల ఏఎస్పీ మునిరామయ్య అన్నారు. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు కనుమ రహదారిపై అవగాహన లేకపోవడంతో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని తెలిపారు. పది సంవత్సరాలకు పైబడిన వాహనాలు కనుమ దారిలో ప్రయాణించాలంటే సామర్థ్య, కాలుష్య నియంత్రణ ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరి అన్నారు.

Ttd pollution control steps
Ttd pollution control steps

By

Published : Nov 11, 2020, 10:35 PM IST

తిరుమల ఘాట్ రోడ్డులో ప్రయాణించే సమయంలో పాటించాల్సిన నిబంధనలతో పాటు, వాయు కాలుష్య నియంత్రణ భక్తుల బాధ్యత అని తిరుమల ఏఎస్పీ మునిరామయ్య అన్నారు. అలిపిరిలో రవాణాశాఖ, కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో కలిసి వాహనాలను తనిఖీ చేశారు. తిరుమల శ్రీవారి దర్శనానికి సొంత వాహనాలపై వచ్చే భక్తులకు కనుమ రహదారిపై అవగాహన లేకపోవడంతో ప్రమాదాలు అధికంగా జరుగుతున్నట్లు ఏఎస్పీ తెలిపారు.

పది సంవత్సరాలకు పైబడిన వాహనాలు కనుమ రహదారిలో ప్రయాణించాలంటే సామర్థ్య, కాలుష్య నియంత్రణ ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరి అన్నారు. తిరుమల శ్రీవారి దర్శనార్థం వివిధ ప్రాంతాల నుంచి సొంత వాహనాల్లో వచ్చే భక్తులు తమ వాహనాలకు అన్ని పత్రాలు సరిచూసుకుని రావాలని రవాణాశాఖ అధికారి సీతారామిరెడ్డి సూచించారు.

ABOUT THE AUTHOR

...view details