కార్తీక పౌర్ణమి పర్వదినాన తితిదే తొలిసారిగా నిర్వహించ తలపెట్టిన కార్తీక దీపోత్సవ ఏర్పాట్లపై తితిదే జేఈఓ సదా భార్గవి సమీక్ష నిర్వహించారు. తిరుపతి పరిపాలన భవనం ప్రాంగణాన్ని పరిశీలించిన ఆమె ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. తితిదే తొలిసారి నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో మహిళా ఉద్యోగులంతా పాల్గొనేలా చూడాలని ఆదేశించారు.
కార్తీక దీపోత్సవంపై తితిదే జేఈఓ సమీక్ష - ttd jeo sada bhargavi latest comments on karthika mahotsavam
తిరుపతి పరిపాలన భవనం ప్రాంగణాన్ని తితిదే జేఈఓ సదా భార్గవి పరిశీలించారు. తితిదే తొలిసారిగా నిర్వహించ తలపెట్టిన కార్తీక దీపోత్సవ ఏర్పాట్లపై సిబ్బందితో సమీక్షించారు.
కార్తీక దీపోత్సవంపై తితిదే జెఈఓ సమీక్ష
కార్తీక దీపోత్సవం విజయవంతం చేసేలా ఆయా శాఖల విభాగాధిపతులు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయటానికి ఎస్వీబీసీ అధికారులు ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఇంజినీరింగ్, విజిలెన్స్, విద్యుత్ శాఖల అధికారులు తమకు నిర్ధేశించిన పనులను 25 లోపు పూర్తి చేయాలని ఆమె ఆదేశించారు. ఉద్యానవన విభాగం.. 30వ తేదీ మధ్యాహ్నానికి పూల అలంకరణలు పూర్తి చేయాలన్నారు.
ఇవీ చూడండి: