ధర్మప్రచారంలో భాగంగా పురాణ ఇతిహాసాలను.. జనజీవనంలోకి తీసుకురావటానికి అనువాద కార్యక్రమాన్ని త్వరగా పూర్తి చేయాలని, తితిదే జేఈవో సదా భార్గవి పండితులను కోరారు. తిరుపతిలోని శ్వేత భవనంలో పురాణ ఇతిహాస ప్రాజెక్టు ఆధ్వర్యంలో జరుగుతున్న.. అష్టాదశ పురాణాల అనువాద పనులను జేఈవో పరిశీలించారు. ప్రాజెక్టు ఆధ్వర్యంలో సంస్కృతం నుంచి తెలుగులోకి అనువాదం చేస్తున్న.. అగ్నిపురాణాన్ని ఉగాది పర్వదినం లోపు ముద్రణ పూర్తి చేయాలని ఆదేశించారు. పురాణ వాజ్ఞయ సేవ సమాజానికి ఎంతో మేలు చేస్తుందన్నారు. వీలైనంత త్వరగా అష్టాదశ పురాణాల అనువాదాన్ని పూర్తి చేయాలన్నారు. ప్రాజెక్టు ప్రత్యేకాధికారి ఆచార్య దక్షిణామూర్తి.. ప్రాజెక్టులో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను జేఈవోకు వివరించారు.
పురాణ వాజ్ఞయ సేవ సమాజానికి మేలు చేస్తుంది: తితిదే జేఈవో సదా భార్గవి - తితిదే ఇతిహాస ప్రాజెక్టు న్యూస్
పురాణ ఇతిహాస ప్రాజెక్టు పనులపై.. తితిదే జేఈవో సదా భార్గవి సమీక్ష నిర్వహించారు. అనువాద కార్యక్రమాన్ని త్వరగా పూర్తి చేయాలని పండితులను కోరారు.
జేఈవో సదా భార్గవి