తిరుపతిలోని తితిదే క్యాంటీన్లలో జేఈఓ సదా భార్గవి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తితిదే పరిపాలనా భవనంలోని ఉద్యోగుల క్యాంటీన్, శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలోని క్యాంటీన్, తిరుచానూరులోని అన్నప్రసాద భవనంలో సిబ్బందితో మాట్లాడారు. కొవిడ్-19 నేపథ్యంలో తీసుకుంటున్న జాగ్రత్తలను తెలుసుకున్నారు. ఆయా క్యాంటీన్లలో ఆహార పదార్థాల నాణ్యత, డైనింగ్ హాల్, వంటశాల, స్టోర్ రూమ్, తాగునీటి వసతి, తడి, పొడి చెత్త సేకరణ, పారిశుద్ధ్య నిర్వహణ తదితరాలను పరిశీలించారు. ఉద్యోగుల క్యాంటీన్‌లో మెను పరిశీలించి మరింత రుచికరమైన ఆహారాన్ని ఉద్యోగులకు అందివ్వాలని ఆదేశించారు. త్వరలో నగదు రహిత లావాదేవీల ద్వారా టోకెన్లు జారీ చేసే విధానాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు.
క్యాంటీన్లను పరిశీలించిన తితిదే జేఈఓ - తితిదే క్యాంటీన్లు తాజా వార్తలు
ఉద్యోగులకు నాణ్యమైన ఆహార పదార్థాలు అందివ్వాలని తితిదే క్యాంటీన్లలోని సిబ్బందికి జేఈఓ సూచించారు. పరిపాలనా భవనంలోని క్యాంటీన్లను ఆమె పరిశీలించారు.
క్యాంటీన్లను పరిశీలించిన తితిదే జేఈఓ