ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Tirumala Brahmotsavam 2021: స్నపన తిరుమంజనం సేవకు ప్రత్యేక ఏర్పాట్లు - Tirumala Brahmotsavam 2021

తిరుమల వార్షిక బ్రహ్మోత్సవాల్లో(Tirumala Brahmotsavam 2021 news) భాగంగా.. శ్రీవారికి స్నపన తిరుమంజనం(Snapana Thirumanjanam at tirumala news) సేవ నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూడు గంటల వరకు ఈ వేడుకను నిర్వహిస్తారు.

Tirumala Brahmotsavam 2021
Tirumala Brahmotsavam 2021

By

Published : Oct 13, 2021, 12:40 PM IST

Updated : Oct 13, 2021, 3:33 PM IST

తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో నిర్వహించే స్నపన తిరుమంజనం సేవకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు(Snapana Thirumanjanam at tirumala news). తిరుమంజనంలో స్వామివారికి అలంకరించేందుకు స్పటిక, కివీప్రూట్‌, పవిత్ర మాలలు, వట్టివేరు, కురు వేరుతో ప్రత్యేక మాలలు, కిరీటాలను సిద్ధం చేశారు.

స్నపన తిరుమంజనం నిర్వహించే రంగనాయకుల మండపాన్ని అరుదైన పూలు, ఫలాలతో అలంకరించారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూడు గంటల వరకు ఉత్సవమూర్తులకు తిరుమంజనం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. బ్రహ్మోత్సవాల్లో (Tirumala Brahmotsavam -2021)ఉత్సవమూర్తులకు నిర్వహించే ఈ తిరుమంజనం సేవ అత్యంత వైభవంగా నిర్వహిస్తారు.

Last Updated : Oct 13, 2021, 3:33 PM IST

ABOUT THE AUTHOR

...view details