ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తిరుమలలో అక్రమ దుకాణాల తొలగింపు - Removal of illegal shops in Thirumal

తిరుమలలో అక్రమ దుకాణాలను తితిదే తొలగిస్తోంది. ఈ మేరకు అఖిలాండం, కల్యాణకట్ట వద్దఉన్న దుకాణాల లైసెన్సులను అధికారులు పరిశీలిస్తున్నారు.

ttd
తితిదే

By

Published : Jun 24, 2021, 4:25 PM IST

తిరుమలలో అక్రమ దుకాణాల తొలగింపును తితిదే మొదలు పెట్టింది. అక్రమంగా వెలసిన దుకాణాలపై గత పాలకమండలి సమావేశంలో చర్చ జరిగింది. ఎలాంటి లైసెన్స్ లేకుండా అనేక షాపులు ఉన్నట్లు బోర్డు దృష్టికి వచ్చింది.

తక్షణమే చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు అఖిలాండం, కల్యాణకట్ట వద్ద ఉన్న దుకాణాల లైసెన్స్​లను పరిశీలిస్తున్నారు. తితిదే రెవిన్యూ, విజిలెన్‌, పోలీసు సిబ్బంది బృందంగా ఏర్పడి దుకాణాలను పరిశీలించి... తొలగిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details