గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు తితిదే పాలక మండలి సభ్యుడు,యుగ తులసి పౌండేషన్ ఛైర్మన్ శివకుమార్ వినతి పత్రం అందజేశారు. శ్రీవారి దర్శనం అనంతరం జస్టిస్ ఎన్వీ రమణను కలిసిన శివ కుమార్..గో హింస, గో హత్యలు ఆపాలని.. కబేళాలు మూసివేయాలని కోరారు. ఈ మేరకు చర్యలు చేపట్టాల్సిందిగా కేంద్రాన్ని ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు.
'గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని కేంద్రాన్ని ఆదేశించండి' - తితిదే పాలక మండలి వార్తలు
గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని కేంద్రాన్ని ఆదేశించాలని జస్టిస్ ఎన్వీ రమణకు తితిదే పాలక మండలి సభ్యుడు శివకుమార్ వినతి పత్రం అందజేశారు. గో హింస, గో హత్యలు ఆపాలని.. కబేళాలు మూసివేయాలని కోరారు.
జస్టిస్ ఎన్వీ రమణకు వినతిపత్రం అందజేత