ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళనలు ఉద్ధృతం చేస్తాం' - thirupathi latest news

తిరుపతిలోని ఇస్కాన్ రోడ్డులో తితిదే అటవీశాఖ ఉద్యోగులు ఆందోళన చేశారు. ఇరవై నాలుగు రోజులుగా నిరసన చేస్తున్నా అధికారులు తమను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

ttd forest staff protest in iscan road thirupathi
తిరుపతిలోని ఇస్కాన్ రోడ్డులో తితిదే అటవీశాఖ ఉద్యోగులు ఆందోళన

By

Published : Dec 19, 2020, 10:24 PM IST

తమ సమస్యల పట్ల నిర్లక్ష్యం వీడకుంటే ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని తితిదే అటవీశాఖ ఉద్యోగులు హెచ్చరించారు. తిరుపతిలోని ఇస్కాన్ రోడ్డులో ఉన్న తితిదే డిఎఫ్ఓ కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. తిరునామాలు ధరించి, గోవింద నామ స్మరణ చేస్తూ ఆందోళన చేశారు. ఇరవై నాలుగు రోజుల నుంచి కార్మికులు దీక్షలు చేస్తున్నా... తితిదే ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. టైం స్కేల్ అమలు చేయాలని పాలకమండలి తీర్మానం చేసినప్పటికీ... డీఏ, హెచ్​ఆర్​ఏతో కూడిన వేతనం ఇవ్వడం లేదని వాపోయారు.

ABOUT THE AUTHOR

...view details