ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తితిదే బోర్డు తీరుపై మాజీ సభ్యుడు అసంతృప్తి..ఇవేమీ చర్యలని వ్యాఖ్య - తితిదే

తిరుమలలోనే తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకోవడం సంప్రదాయమని తితిదే పాలకమండలి మాజీ సభ్యులు ఓవీ రమణ అన్నారు. శ్రీనివాసమంగాపురం, అప్పలాయగుంటలో తలనీలాలు సమర్పించవచ్చని తితిదే ప్రకటించటం హాస్యాస్పందంగా ఉందని వ్యాఖ్యానించారు.

తితిదే పాలకమండలి మాజీ సభ్యులు ఓవీ రమణ
తితిదే పాలకమండలి మాజీ సభ్యులు ఓవీ రమణ

By

Published : Sep 17, 2021, 10:23 PM IST

తిరుమలలో కాకుండా ఎక్కడైనా తలనీలాలు సమర్పించవచ్చని..ఏ ఆగమం, పీఠాధిపతి చెప్పారని తితిదే పాలకమండలి మాజీ సభ్యుడు ఓవీ రమణ..తితిదే అధికారులను ప్రశ్నించారు. శ్రీనివాసమంగాపురం, అప్పలాయగుంటలో తలనీలాలు సమర్పించవచ్చని తితిదే ప్రకటించటం హాస్యాస్పందంగా ఉందని అన్నారు. తిరుమలలోనే తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకోవడం సంప్రదాయమని తెలిపారు.

చర, స్థిర ఆస్తులు విక్రయించేది లేదని తితిదే ఛైర్మన్​ ప్రకటిస్తే.. ఈఓ లీజుకు ఇస్తామని చెప్పడం వెనుక మర్మం ఉందని ఆరోపించారు. సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తామని అంటున్న తితిదే అధికారులు.. ఏడాదిన్నరగా సామాన్యుడిని దర్శనానికి అనుమతించటం లేదని విమర్శించారు. తిరుమల హనుమాన్​ జన్మస్థానమంటూ.. వెంకటేశ్వర స్వామి వైభవాన్ని దెబ్బతీసేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు.

ఇదీ చదవండి:CBN LETTER TO CM: 'వెంకన్న ప్రతిష్ఠను దెబ్బతీసేలా జంబో పాలకమండలి.. భవిష్యత్‌లో పశ్చాత్తాపం తప్పదు'

ABOUT THE AUTHOR

...view details