తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో జవహర్‌రెడ్డి తిరుపతి శ్రీ వెంకటేశ్వర గోసంరక్షణశాలలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. గోశాల ప్రవేశంలో ఏర్పాటు చేసిన ఆర్చి, రహదారులను పరిశీలించి మార్పులను సూచించారు.
స్వామివారికి వాడిన పుష్పాలు,పంచగవ్యాల మిశ్రమంతో అగరబత్తీలను తయారు చేసేందుకు నిర్మిస్తున్న షెడ్డు, పశువుల దాణా గోదాం, దాణా మిక్సింగ్ ప్లాంటులను పరిశీలించారు. గోశాలలోని పశువుల సంఖ్య, వాటికి అందిస్తున్న దాణా వివరాలు గోశాల డైరెక్టర్ డాక్టర్ హరినాథరెడ్డి ఈవోకు వివరించారు.