శరవేగంగా పుష్కరిణి పనులు - piligrims
తిరుమలలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అధికారులతో కలసి పరిశీలించారు.
తిరుమల
96 కోట్ల రూపాయలతో నిర్మించిన సేవా సదన్ భవనంలో శ్రీవారి సేవకులకు అందుతున్న వసతులు కల్పించాల్సిన సౌకర్యాలపై అనిల్ కుమార్ చర్చించారు. సేవకులను పూర్తిస్థాయిలో వినియోగించుకుంటూ భక్తులకు సేవ చేయాలని సూచించారు. నారాయణగిరి ఉద్యానవనంలో 23 కోట్లతో నిర్మిస్తున్న క్యూ కాంప్లెక్స్ పనులను, నాలుగున్నర కోట్లతో చేపట్టిన శ్రీవారి పుష్కరిణి పనులను పరిశీలించారు.