ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఉద్యోగి మరణించిన నెల రోజుల్లోనే కారుణ్య నియామకం'

ప్రపంచ ప్రఖ్యాత హిందూ ధార్మిక సంస్థ అయిన తిరుమల తిరుపతి దేవస్థానంలో.. ఉద్యోగం చేయడం పూర్వజన్మ సుకృతమని తితిదే ఈఓ జవహర్ రెడ్డి అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో వివిధ విభాగాల‌లో విధులు నిర్వ‌హిస్తూ మ‌ర‌ణించిన ఉద్యోగుల కుటుంబ స‌భ్యులు 118 మందికి తిరుపతి మహతి ఆడిటోరియంలో కారుణ్య నియామ‌కపత్రాలు అందజేశారు.

ttd-eo-on-compassionate-appointment
తితిదేలో కారుణ్య నియామాక పత్రాల అందజేత

By

Published : Jul 3, 2021, 9:02 AM IST

తితిదేలోని వివిధ విభాగాల‌లో విధులు నిర్వ‌హిస్తూ మ‌ర‌ణించిన ఉద్యోగుల కుటుంబ సభ్యులకు కారుణ్య నియామక పత్రాలు ఈవో జవహర్ రెడ్డి అందించారు. ప‌రిపాల‌నాప‌ర‌మైన కార‌ణాల వల్ల కారుణ్య‌ నియామ‌కాలకు ఆలస్యమైందని ఈఓ తెలిపారు. ఇప్పుడు కారుణ్య నియామక ప్రక్రియను సులభతరం చేశామని, ఉద్యోగి మరణించిన 15 రోజులలోపు వారి కుటుంబ సభ్యులు దరఖాస్తు చేసుకుంటే నెల రోజుల్లో నియామక పత్రం అందిస్తామని వెల్లడించారు.

ఉద్యోగాలు పొందిన వారికి రెండు వారాల పాటు శిక్ష‌ణ ఉంటుందని, క్రమశిక్షణతో తితిదే ప్రతిష్టను మరింత పెంచే విధంగా విధులు నిర్వహించాలని కోరారు. తిరుపతి మహతి ఆడిటోరియంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో తిరుపతి శాసనసభ్యులు కరుణాకర్ రెడ్డి , జెఈఓ సదా భార్గవి ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఇది చదవండి:

రామోజీ ఫిల్మ్ సిటీలో యువ హీరోల సందడి

ABOUT THE AUTHOR

...view details