ఈ నెల చివరి నాటికి బర్డ్ ఆసుపత్రి నిర్వహణ, సేవలకు సంబంధించి సాంకేతిక పరిజ్ఞాన సేవలు అమలులోకి తీసుకురావాలని తితిదే ఈవో జవహర్ రెడ్డి.. అధికారులను ఆదేశించారు. తితిదే పరిపాలన భవనంలోని తన కార్యాలయంలో బర్డ్ ఆసుపత్రి, తితిదే ఐటీ విభాగం అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆసుపత్రి నిర్వహణ, క్లినికల్, ఆర్థిక వ్యవహారాలు అనే మూడు విభాగాలుగా సేవలు విభజించి సాఫ్ట్వేర్ రూపొందించాలని జవహర్ రెడ్డి సూచించారు. తితిదే ముఖ్య వైద్యాధికారితో సమన్వయం చేసుకుంటూ... ఆసుపత్రి నిర్వహించాలని చెప్పారు. బర్డ్ ఆసుపత్రిలో ఉన్న ఆపరేషన్ థియేటర్ల సామర్థ్యం, వైద్యుల పని తీరు గురించి బర్డ్, ఐటీ అధికారులను అడిగి తెలుసుకున్నారు.
'ఈ నెల చివరి నాటికి సాంకేతిక సేవలు అమలులోకి తేవాలి' - thirumala latest news
తితిదే పరిపాలన భవనంలో తితిదే ఈవో జవహర్‌రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ నెల చివరి నాటికి బర్డ్ ఆస్పత్రిలో సాంకేతిక పరిజ్ఞానం సేవలు అందుబాటులోకి తేవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
తితిదే ఈవో జవహర్‌రెడ్డి