ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'తిరుమల వేంకటేశుని అవసరాలకు 10 ఎక‌రాల్లో శ్రీ‌గంధం వ‌నం' - 10 ఎక‌రాల్లో శ్రీ‌గంధం వ‌నం పెంచుతున్న తితిదే

తిరుమలలో జరుగుతున్న అభివృద్ది పనులను పరిశీలిస్తున్న తితిదే ఈవో జవహార్‌ రెడ్డి.. శ్రీ‌వారి ఆల‌య అవ‌స‌రాల కోసం అట‌వీ విభాగం ఆధ్వ‌ర్యంలో 10 ఎక‌రాల శ్రీ‌గంధం వ‌నం పెంచుతున్నట్టు తెలిపారు. ఉద్యాన‌వ‌న విభాగంలో పూలు నిల్వ చేసే కోల్డ్ స్టోరేజిని, పూల‌మాల‌ల త‌యారీని స్వయంగా పరిశీలించారు. ఉద్యానవన విభాగానికి సుందరీకరణకు సంబంధించిన సూచనలు చేశారు.

ttd eo inspecting works
'తిరుమల వేంకటేసుని అవసరాలకు..10 ఎక‌రాల్లో శ్రీ‌గంధం వ‌నం'

By

Published : Dec 17, 2020, 2:02 PM IST

తిరుమలలో జరుగుతున్న పలు అభివృద్ది పనులను అధికారులతో కలిసి తితిదే ఈవో జవహార్‌ రెడ్డి పరిశీలించారు. శంకుమిట్ట‌, నారాయ‌ణ‌గిరి కాటేజీల్లో జరుగుతున్న పనుల పురోగతిపై అరా తీశారు. వైకుంఠ ఏకాద‌శికి భ‌క్తుల‌కు అందుబాటులోకి తేవాలని ఆదేశించారు.

శ్రీ‌వారి ఆల‌య అవ‌స‌రాల కోసం అట‌వీ విభాగం ఆధ్వ‌ర్యంలో 10 ఎక‌రాల్లో శ్రీ‌గంధం వ‌నం పెంచుతున్నట్టు తెలిపారు. తిరుమలకు వచ్చే భ‌క్తుల‌కు కనువిందు కలిగించే విధంగా.. రహదారి కూడ‌ళ్లలోని డివైడ‌ర్ల‌లో పూల మొక్కల పెంచాల‌ని ఉద్యాన‌వ‌న విభాగానికి సూచించారు. బాట‌గంగ‌మ్మ గుడి మార్గంలో ఉప‌యోగంలో లేని సామ‌గ్రిని తొల‌గించాల‌ని.. సేవా స‌ద‌న్ వెనుక ఉన్న నీటి కుంట‌ను సుంద‌రీక‌రించాల‌న్నారు. ఉద్యాన‌వ‌న విభాగంలో పూలు నిల్వ చేసే కోల్డ్ స్టోరేజిని, పూల‌మాల‌ల త‌యారీని ఈవో పరిశీలించారు.

ఇదీ చదవండి:వారం రోజుల్లో పెళ్లి... ఇంతలో హత్యాయత్నం

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details