తిరుమలలో బ్రహ్మోత్సవాలపై తితిదే పరిపాలనా భవనంలో అధికారులతో తితిదే ఈవో అనిల్ కుమార్ సింఘాల్ సమావేశం నిర్వహించారు. తిరుమల శ్రీనివాసుడి బ్రహ్మోత్సావాల్లో భాగంగా లగేజీ కౌంటర్లను పెంచాలని అధికారులకు ఈవో సూచించారు. భక్తులకు తాగునీరు, ఆహారం వంటి మౌలిక వసతులపై దృష్టి సారించాలన్నారు. తిరుమల...తిరుపతి పరిసర ప్రాంతాల్లో పచ్చదనం, అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేయాలని చెప్పారు. నాలుగు మాడ వీధుల్లో ఇంజినీరింగ్ పనులను పూర్తి చేసి... బ్రహ్మోత్సావాలను దిగ్విజయం చేయాలని కోరారు. 10 రాష్ట్రాల నుంచి బ్రహ్మోత్సావాలకు భక్త మండళ్లు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని.. మిగిలిన రాష్ట్రాలతో మాట్లాడి ఆయా రాష్ట్రాల సంప్రదాయ భక్తమండళ్లను ఆహ్వానించాలని అధికారులకు ఆయన సూచించారు.
"శ్రీవారి బ్రహ్మోత్సావాలకు పది రాష్ట్రాల భక్తమండళ్లు"
శ్రీవారి బ్రహ్మోత్సావాలకు పది రాష్ట్రాల భక్తమండళ్లు వచ్చేందుకు సుముఖత చూపుతున్నాయని తితిదే ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు.
TTD eo anil kumar singhal conducted meeting about srinavasa brahmoostavalu at ttd adminstration buliding in thirupati chittore district