తితిదే బర్డ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరోనా రోగులను తితిదే ఉద్యోగ సంఘాల నాయకులు పరామర్శించారు. కొవిడ్ బాధితులకు సేవలు చేస్తున్న డాక్టర్లు, వైద్య సిబ్బందికి అభినందనలు తెలిపారు. తితిదే యాజమాన్యం.. ఇతర రాష్ట్రాల నుంచి ఆక్సిజన్ సిలండర్లు, వెంటిలేటర్లు తెప్పించి వందలాది మంది ఉద్యోగులకు సేవలందిస్తున్నట్లు తెలిపారు. తితిదే ఉద్యోగులు,పెన్షనర్లు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నట్లు వివరించారు.
ఇవీ చదవండి: