తిరుమలలో తితిదే ఉద్యోగులతో అవినీతికి వ్యతిరేకంగా అధికారులు ప్రతిజ్ఞ చేయించారు. కేంద్ర విజిలెన్స్ కమిషన్ పిలుపు మేరకు అక్టోబర్ 27 నుంచి నవంబర్ 2వ తేదీ వరకు జరుగుతున్న విజిలెన్స్ అవగాహన వారోత్సవాల్లో భాగంగా ఈ కార్యక్రమం జరిగింది. తితిదే నిఘా, భద్రతా విభాగం ఆధ్వర్యంలో శ్రీవారి సేవా సదన్ భవన్‌లో నిర్వహించారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్-1, 2, వసతి విభాగం-1,2 కల్యాణకట్ట సిబ్బంది, భద్రతా సిబ్బంది, శ్రీవారి సేవకులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అవినీతికి వ్యతిరేకంగా, సంస్థ పట్ల నిబద్ధత కలిగి భక్తులకు సేవ చేస్తామని వారు ప్రతిజ్ఞ చేశారు.
అవినీతికి వ్యతిరేకంగా తితిదే సిబ్బంది ప్రతిజ్ఞ - తితిదే సిబ్బంది ప్రతిజ్ఞ
తితిదే నిఘా, భద్రతా విభాగం ఆధ్వర్యంలో విజిలెన్స్ అవగాహన వారోత్సవాల్లో భాగంగా అవినీతికి వ్యతిరేకంగా సిబ్బందితో అధికారులు ప్రతిజ్ఞ చేయించారు. శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులు సంతృప్తికరంగా తిరుమల యాత్ర పూర్తి చేసుకుని వెళ్లేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని వారు కోరారు.
అప్రమత్త భారత్, సంపన్న భారత్ అనే థీమ్‌తో ఈ ఏడాది విజిలెన్స్అవగాహన వారోత్సవాలు నిర్వహిస్తున్నామని తితిదే విజివో మనోహర్ తెలిపారు. శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులు సంతృప్తికరంగా తిరుమల యాత్ర పూర్తి చేసుకుని వెళ్లేందుకు ఉద్యోగులు, శ్రీవారి సేవకులు, ట్యాక్సీ డ్రైవర్లు, హోటళ్లు, దుకాణాల నిర్వాహకులు సహకరించాలని కోరారు. భక్తులకు ఎలాంటి సమస్యలు ఎదురైనా, అవకతవకలను గుర్తించినా తితిదే టోల్‌ఫ్రీ నంబరకు తెలియజేయాలని సూచించారు.
ఇదీ చూడండి.చలో గుంటూరు జైలుకు అనుమతి లేదు: గుంటూరు అర్బన్ ఎస్పీ