తిరుపతితో పాటు, నగర శివార్లలో తితిదే ఉద్యోగులకు కేటాయించిన ఇళ్ల స్థలాలను రద్దు చేసి మరో చోట కేటాయించటంపై లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తితిదే కేటాయించిన ఇళ్ల స్థలాల్లో అప్పులు చేసి ప్రహరీలు నిర్మించామని నీటి వసతి కోసం బోర్లు వేసుకున్నామని తెలిపారు. ఉన్నఫళంగా స్థలాలను రద్దు చేసి వేరే ప్రాంతాల్లో ఇస్తామనటం సరైంది కాదని వాపోయారు. తితిదే నిర్ణయంపై పునరాలోచించి తమ ఇళ్ల స్థలాలు అప్పగించాలని కోరారు.
TTD EMPLOYEES: ఇళ్ల స్థలాల రద్దుపై తితిదే ఉద్యోగుల ఆవేదన - TTD employees latest updates
తితిదే ఉద్యోగులకు కేటాయించిన ఇండ్ల స్ధలాలను రద్దు చేసి 20 కిలోమీటర్ల దూరంలో కేటాయించడంపై లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2007లో కేటాయించిన బ్రాహ్మణపట్టు, వినాయక నగర్, కేశవాయిని గుంట ప్రాంతాలలో కేటాయించిన స్ధలాలను రద్దు చేశారని తెలిపారు.
ఇళ్ల స్థలాల రద్దుపై తితిదే ఉద్యోగుల ఆవేదన