సమాజాన్ని సన్మార్గంలో నడిపించేందుకు దోహదపడే వేదవిద్యను బాధ్యతగా భావించాలని విద్యార్థులను తిరుమల తిరుపతి దేవస్థానం(తితిదే) అదనపు ఈవో ధర్మారెడ్డి కోరారు. సూర్యమండలం, నవగ్రహాలు, భూగోళం లాంటి అంశాలను శాస్త్రవేత్తలు ఆవిష్కరించడానికి ముందే వేదాల్లో ఉన్నాయన్నారు. శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం 15వ ఆవిర్భావ దినోత్సవంలో ధర్మా రెడ్డి పాల్గొన్నారు. విద్యార్థులు ఎంతో సాధన చేస్తేగానీ ఇందులో రాణించలేరని ముఖ్య అతిథిగా హాజరైన అదనపు ఈవో అభిప్రాయపడ్డారు.
వేదాలలో దాగి ఉన్న సైన్స్ రహస్యాలను వెలికితీయాలని విద్యార్థులను కోరారు. శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో పరిశోధనలను విస్తృతం చేసి వేదాల్లోని విజ్ఞానాన్ని సమాజానికి అందించాలన్నారు.