తితిదే దిల్లీ స్థానిక సలహా మండలి ఛైర్‌పర్సన్‌గా ప్రశాంతి రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఇందులో భాగంగా.. తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డితో కలిసి దిల్లీ ఆలయంలో గోపూజ చేశారు. ఉత్తరాదిలో ఆలయాల విస్తరణకు దిల్లీ సలహా మండలి కృషి చేస్తుందని తితిదే ఛైర్మన్ తెలిపారు. దిల్లీ, కురుక్షేత్ర సహా పలుచోట్ల తితిదే ఆలయాలున్నాయని ఆయన వివరించారు. జమ్ములో ఆలయ నిర్మాణానికి ఇప్పటికే శంకుస్థాపన చేసినట్లు పేర్కొన్నారు.
TTD: దిల్లీ స్థానిక సలహా మండలి ఛైర్‌పర్సన్‌గా.. ప్రశాంతి రెడ్డి బాధ్యతల స్వీకరణ
తితిదే దిల్లీ స్థానిక సలహా మండలి ఛైర్‌పర్సన్‌గా ప్రశాంతి రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఇందులో భాగంగా.. తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డితో కలిసి గోపూజ చేశారు.
తితిదే దిల్లీ స్థానిక సలహా మండలి ఛైర్‌పర్సన్‌గా ప్రశాంతి రెడ్డి బాధ్యతలు
18 నెలల్లో ఆలయ నిర్మాణానికి టెండర్లు పిలిచినట్లు తెలిపారు. అయోధ్యలో స్థలం కేటాయించాలని రామజన్మభూమి ఆలయ నిర్మాణ కమిటీని కోరినట్లు వెల్లడించారు. కానీ ఆలయ నిర్మాణ కమిటీ నుంచి స్పందన రాలేదని.. వచ్చాక ఆలయం లేదా భజన మందిరంపై నిర్ణయం తీసుకుంటామని వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. ప్రసాదం, నిత్యాన్నదానం కోసం గోవు ఆధారిత పంటలను తితిదే కొనుగోలు చేస్తుందని వివరించారు.
ఇదీ చూడండి:LIVE VIDEO : మూతికి నిప్పు.. అలరించబోయి విలపించాడు..!