తిరుమల శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం విధానంలో మార్పులను తితిదే అమల్లోకి తెచ్చింది. నేటి నుంచే కొత్త విధానం అమలవుతోంది. తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆదేశాల మేరకు వీఐపీ ప్రారంభ దర్శనంలో ఎల్-1, ఎల్-2 జాబితాలను రద్దు చేశారు. సాధారణ దర్శనం టిక్కెట్లను జారీ చేస్తున్నారు. గురువారం ఉదయం వీఐపీ టిక్కెట్ల ద్వారా శ్రీవారి ఆలయానికి వచ్చే భక్తులందరికీ ఒకే విధానంపై దర్శనం కల్పించనున్నారు.
శ్రీవారి దర్శన విధానం మారింది.. తెలుసుకున్నారా? - తిరుమల
శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శన విధానంలో తితిదే మార్పులు చేసింది. వీఐపీ ప్రారంభ దర్శనంలో ఎల్-1, ఎల్-2 జాబితాలను రద్దు చేసి సాధారణ దర్శనం టిక్కెట్లను జారీ చేస్తోంది. నేటి నుంచే ఈ విధానం అమల్లోకి వచ్చింది.
శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శన విధానంలో మార్పులు