తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించే నగదు కానుకలను ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో జాతీయ బ్యాంకుల్లోనే జమ చేయాలని తితిదే ధర్మకర్తల మండలి నిర్ణయించినట్లు సమాచారం. దాదాపు రూ.12 వేల కోట్ల విలువైన నగదు, 85 టన్నుల బంగారాన్ని తితిదే వివిధ జాతీయ, ప్రైవేటు బ్యాంకుల్లో జమ చేసింది. దీనిపై తితిదేకు వడ్డీ రూపంలో ఏటా కోట్ల రూపాయల ఆదాయం వస్తోంది. గతేడాది రూ.4000 కోట్లు ఆదాయంలో రూ.3 వేల కోట్లను ఆంద్రాబ్యాంకులో.. రూ.1000 కోట్లను ఇండస్ ప్రైవేటు బ్యాంకులో దేవస్థానం డిపాజిట్ చేసింది. ప్రస్తుతం ధర్మకర్తల మండలి తన వైఖరి మార్చుకుని జాతీయ బ్యాంకుల్లోనే నగదు జమ చేయాలని యోచిస్తోంది. ప్రైవేటు బ్యాంకుల్లో డబ్బు డిపాజిట్లపై 8.6 శాతం వడ్డీ వస్తుండగా.. జాతీయ బ్యాంకుల్లో 6.57 శాతం వడ్డీ రానుంది. వడ్డీ రూపంలో లోటు ఏర్పడుతున్నా డిపాజిట్లకు భద్రత ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.
జాతీయ బ్యాంకుల్లోనే నగదు 'ఫిక్స్'డ్ చేయాలని తితిదే నిర్ణయం - తిరుమల దేవస్థానం వార్తలు
తిరుమలలో భక్తులు సమర్పించే నగదును ఇక జాతీయ బ్యాంకుల్లోనే ఫిక్స్డ్ డిపాజిట్ చేయనున్నట్లు తితిదే నిర్ణయించినట్లు సమాచారం. ప్రైవేటు బ్యాంకుల కన్నా వడ్డీ తక్కువగా వస్తున్నా.. నగదుకు భద్రత ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.
జాతీయ బ్యాంకుల్లోనే నగదు 'ఫిక్స్'డ్ చేయాలని తితిదే నిర్ణయం