తిరుచానూరులోని శ్రీ పద్మావతి నిలయ నిర్మాణ అంశంపై తితిదేకు నిర్మాణ గుత్తేదారుకు మధ్య వివాదం తలెత్తింది. నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించారంటూ గుత్తేదారుపై తిరుచానూరు పోలీస్ స్టేషన్లో తితిదే అధికారులు ఫిర్యాదు చేశారు. 2014లో జరిగిన ఒప్పందాలకు విరుద్ధంగా గుత్తేదారు సొంతంగా అర్బిట్రేటర్ను నియమించుకున్నారని తితిదే ఫిర్యాదులో పేర్కొంది. ఆర్బిట్రేటర్తో కలిసి తితిదే ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరించాని ఆరోపించారు.
శ్రీ పద్మావతి నిలయ నిర్మాణ గుత్తేదారులపై తితిదే ఫిర్యాదు
తిరుచానూరులోని శ్రీ పద్మావతి నిలయ నిర్మాణ అంశంపై తితిదేకు గుత్తేదారులకు మధ్య వివాదం ఏర్పడింది. గుత్తేదారులు ఒప్పందానికి విరుద్ధంగా వ్యవహరించారని తితిదే ఫిర్యాదులో పేర్కొంది. గుత్తేదారు ఎన్వీఆర్ రెడ్డితో పాటు ఆర్బిట్రేటర్ జగన్మోహనరావును తిరుచానూరు పోలీసులు అరెస్టు చేశారు.
తిరుచానూరులోని శ్రీ పద్మావతి నిలయం
తితిదే అధికారులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా విశాఖపట్నానికి చెందిన గుత్తేదారు ఎన్వీఆర్ రెడ్డితో పాటు ఆర్బిట్రేటర్ జగన్మోహనరావును తిరుచానూరు పోలీసులు అరెస్టు చేశారు. రిమాండు విధించాలని కోరుతూ తిరుపతి న్యాయస్థానంలో హాజరుపరిచారు. సాంకేతిక కారణాలతో రిమాండ్ విధించలేమని న్యాయమూర్తి స్పష్టం చేశారు.
ఇదీ చదవండి