ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తిరుచానూరు అమ్మవారి ఆలయ దర్శన వేళల్లో మార్పులు - tiruchanuru sri padamavathi temple updates

రాష్ట్రంలో కర్ఫ్యూ కారణంగా.. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ దర్శన వేళల్లో మార్పులు చేసినట్లు తితిదే తెలిపింది.

tiruchanur
తిరుచానూరు అమ్మవారు

By

Published : May 5, 2021, 3:33 PM IST

Updated : May 5, 2021, 9:13 PM IST

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ దర్శన వేళల్లో... తితిదే మార్పులు చేసింది. రాష్ట్రంలో మధ్యాహ్నం 12 గంటల తరువాత కర్ఫ్యూ విధిస్తున్న కారణంగా.. దర్శన వేళల్లో మార్పులు చేసినట్లు తితిదే వెల్లడించింది. ఉదయం 6 నుంచి మధ్యాహ్నాం 12.45 వరకే దర్శనాలకు అనుమతి ఇస్తామని తితిదే తెలిపింది.

మధ్యాహ్నం 12.45 నుంచి సాయంత్రం 4 వరకు దర్శనాలు నిలిపివేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం స్పష్టం చేసింది. సాయంత్రం 4 నుంచి 7.15 వరకు దర్శనానికి అనుమతి ఉంటుందని తితిదే తెలిపింది. శుక్రవారం ఉదయం అమ్మవారికి అభిషేకం సందర్భంగా 4.30 నుంచి రాత్రి 7.15 వరకు విరామం లేకుండా అమ్మవారి దర్శనానికి అనుమతి ఇస్తున్నట్లు తితిదే అధికారులు వివరించారు.

Last Updated : May 5, 2021, 9:13 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details