కరోనా తీవ్రరూపం దాల్చుతుండడంతో తితిదే సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. తిరుమల అన్నమయ్య భవన్ లో సమీక్ష నిర్వహించిన ఆయన.. కొవిడ్ వ్యాప్తి నియంత్రణకు తీసుకోవలసిన చర్యలపై అధికారులతో చర్చించారు. కరోనా సెకండ్ వేవ్‌లో 15 మంది తితిదే సిబ్బంది మృతి చెందడం బాధాకరమని సుబ్బారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వారి ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా వ్యాక్సినేషన్‌ను ప్రారంభించామన్నారు.
కరోనా సెకండ్ వేవ్‌తో అప్రమత్తంగా ఉండాలి: తితిదే ఛైర్మన్ సుబ్బారెడ్డి - thirumala latest news
తిరుమల అన్నమయ్య భవన్లో తితిదే ఉన్నతాధికారులతో ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సమీక్ష నిర్వహించారు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా తితిదే సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. శ్రీవారి దర్శనార్ధం తిరుమలకు వచ్చే వారు కచ్చితంగా కొవిడ్ నిబంధనలు పాటించాలని స్పష్టం చేశారు.
తితిదే ఛైర్మన్ సుబ్బారెడ్డి
కరోనా సోకిన తితిదే ఉద్యోగులకు చికిత్స అందించేందుకు తిరుపతిలోని బర్డ్ ఆస్పత్రిని కొవిడ్ కేంద్రంగా మార్చాలని అధికారులను ఆదేశించారు. శ్రీవారి దర్శనార్ధం తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా తగ్గిందన్న ఛైర్మన్ సుబ్బారెడ్డి... తిరుమలకు వచ్చే భక్తులు కరోనా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు.
ఇదీచదవండి.