తన ప్రతిష్ట దిగజార్చేలా సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని... తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధికారులను ఆదేశించారు. వ్యక్తిగతంగా తనపై దుష్ప్రచారం చేయడమే కాక... భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వ్యవహరించిన వారిపై పోలీసు కేసు నమోదు చేయాలని.. తితిదే విజిలెన్స్ అధికారులను ఆదేశించారు.
రాజమహేంద్రవరంలో జరిగిన ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీకి హాజరైన అనంతరం వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. ప్రజలందరినీ శ్రీ వెంకటేశ్వర స్వామి, జీసస్, అల్లా కాపాడుతున్నారని అన్నారు. దాడులు చేసే వారిని ప్రభుత్వం ఉపేక్షించదని చెప్పారు. కొందరు వ్యక్తులు తాను మాట్లాడిన వీడియోను కట్ చేసి సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేస్తున్నారన్నారు.