కర్ణాటక రాష్ట్ర సీఎం, మాజీ సీఎంలను తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కలిశారు. ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్పను బెంగళూరులో మర్యాదపూర్వకంగా కలిశారు. శ్రీ వేంకటేశ్వర స్వామి వారి తీర్థప్రసాదాలను అందించి.. శాలువతో సత్కరించారు. అనంతరం దొడ్డేన కుండిలోని కోదండ రామస్వామి వారిని తితిదే ఛైర్మన్ దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వైవీ సుబ్బారెడ్డికి స్వాగతం పలికి.. ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. తితిదే ఛైర్మన్‌తో పాటు నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నందీష్ రెడ్డి ఉన్నారు.
కర్ణాటక సీఎం, మాజీ సీఎంలను కలిసిన తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి - Ttd Chairman YV Subbareddy karnataka tour news
కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, మాజీ సీఎం యడ్యూరప్పను తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం దొడ్డేన కుండిలోని కోదండ రామస్వామి వారిని దర్శించుకున్నారు.
తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి