తిరుమలలో పవిత్ర ఉద్యానవనం పెంచేందుకు తితిదే శ్రీకారం చుట్టింది. శిలాతోరణం వద్ద 35 ఎకరాల్లో ఉద్యానవన ఏర్పాటుకు తితిదే ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఈవో జవహార్ రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డితో కలసి మొక్కలు నాటారు. శిలాఫలకం ఆవిష్కరించారు. శ్రీవారి సేవలకు వినియోగించే పూలు, పళ్లను ఇక్కడే పెంచేందుకు ఉద్యానవనం ఏర్పాటు చేస్తున్నామన్నారు. 25 రకాల మొక్కలు ఉన్నట్లు ఆయన తెలిపారు. దీంతో పాటు గోగర్బం వద్ద 1.5 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయనున్న శ్రీవేంకటేశ్వర శ్రీగందపు ఉద్యానవనాన్ని ప్రారంభించారు.
తిరుమలేశుడికి ఉద్యానవనం ఏర్పాటు.. మొక్కలు నాటిన తితిదే ఛైర్మన్.. - yv subbareddy foundation stone for pavitra garden at tirumala news update
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి పూజకు వినియోగించే పూలు, పళ్లు కోసం.. ప్రత్యేకంగా చెట్లు పెంచనున్నట్లు.. తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. పవిత్ర ఉద్యానవనం పేరుతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా శిలాతోరణం వద్ద తితిదే ఈవో, అదనపు ఈవోలతో కలిసి మొక్కలు నాటారు.
తిరుమలలో ఉద్యానవనానికి శంకుస్థాపన చేసిన తితిదే ఈవో