'50 శాతం' నుంచి.. తితిదేకు మినహాయింపు: వైవీ
తిరుపతి ఎస్వీ బాలసదన్‌ను తితిదే పాలకమండలి అధ్యక్షుడు వైవీ సుబ్బారెడ్డి పరిశీలించారు. తితిదే ధర్మకర్తల మండలి విషయంలో... 50 శాతం రిజర్వేషన్ల నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు తెలిపారు.
నామినేటెడ్ పదవులు, ట్రస్టు బోర్డుల పాలకమండళ్ళ నియామకాల్లో... ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50 శాతం రిజర్వేషన్ చట్టం నుంచి.... తితిదేని మినహాయించినట్లు ధర్మకర్తల మండలి ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. తిరుపతిలోని ఎస్వీ బాలమందిరాన్ని ఆయన పరిశీలించారు. విద్యార్థుల నైపుణ్యం ఆధారంగా..... వారి ఉన్నత చదువుల కోసం తితిదే సహకారం అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. తితిదే ధర్మకర్తల మండలిలో 50 శాతం రిజర్వేషన్ అమలు ద్వారా మతపరమైన విబేధాలు నెలకొంటాయని పలువురు మఠాధిపతులు, హిందూ ధార్మిక సంస్ధల నిర్వాహకులు అభిప్రాయపడ్డారని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. వారి అభిప్రాయాల గౌరవిస్తూ 50 శాతం రిజర్వేషన్ల నుంచి తితిదే బోర్డును మినహయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు.