తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తిరుమలలోని కొండ ప్రాంతాలను పరిశీలించారు. తిరుమల కొండపై పచ్చదనం పెంచడంతోపాటు.. డీజిల్ వాహనాలను దశలవారీగా నిలిపివేసి... బ్యాటరీ వాహనాలను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. మొదటి దశలో కొండపై తిరిగే జీపులను, రెండో దశలో తిరుమలకు వచ్చే వాహనాలను నిలిపివేయనున్నట్లు చెప్పారు. బ్యాటరీ బస్సులను తీసుకొస్తామని తెలిపారు. దీనిపై బోర్డు సమావేశంలో చర్చించి నిర్ణయం ప్రకటిస్తామన్నారు. భక్తులకు వసతి గదుల సౌకర్యం పెంచేందుకు చర్యలు తీసుకుంటామని వివరించారు.
డీజిల్ వాహనాలను దశలవారీగా నిలిపివేస్తాం - Tirumala
తిరుమలలో పర్యావరణ పరిరక్షణ చర్యలు చేపట్టనున్నట్లు తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. తితిదే ధర్మకర్తల మండలి అధ్యక్షుడిగా భాధ్యతలు చేపట్టిన వైవీ సుబ్బారెడ్డి... అధికారులతో కలిసి కొండపై ప్రాంతాలను పరీశీలించారు. క్యూలైన్లు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్, శ్రీవారి ఆలయం, లడ్డూ తయారీ కేంద్రాలను పరిశీలించారు. భక్తులతో మాడ్లాడారు. వసతులపై ఆరాతీశారు.
తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి