రెండు నెలల్లో తిరుపతిలోని అలిపిరి వద్ద దాతల సహకారంతో నిర్మిస్తున్న గోమందిరాన్ని పూర్తి చేస్తామని తితిదే పాలక మండలి ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. గోమందిరాన్ని పాలకమండలి సభ్యులతో కలిసి సందర్శించారు. పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
కరోనా కారణంగా ఇప్పటికే 3 నెలల పాటు నిర్మాణ పనులు నిలిచిపోయాయని అన్నారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులు.. మొదట గోపూజ చేసుకుని వెళ్లేలా ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నామని సుబ్బారెడ్డి తెలిపారు.