తితిదే చేపట్టిన అభివృద్ధి పనులకు వైవీ సుబ్బారెడ్డి శంకుస్థాపన
కోటిన్నర రూపాయల నిధులతో చిత్తూరు జిల్లా, గంగాధర నెల్లూరు నియోజకవర్గం, కార్వేటినగరంలో తిరుమల తిరుపతి దేవస్థానం చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలకు తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ పనులును త్వరలోగా పూర్తి చేసి ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి పాల్గొన్నారు.
చిత్తూరు జిల్లా, గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని కార్వేటినగరంలో కోటిన్నర రూపాయలతో తితిదే చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలకు తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి శంకుస్థాపన చేశారు. వేణుగోపాల స్వామి ఆలయంలో స్కంద పుష్కరిణి, నీరాలి మండపం, ఆలయం నుంచి పుష్కరిణి వరకూ సీసీ రోడ్డు నిర్మాణాలకు నిధులు కేటాయించినట్లు తెలిపారు. హిందూధర్మ ప్రచారానికి తితిదే అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని దళిత, బలహీన వర్గాల కాలనీల్లో శ్రీవారి దేవాలయాలు నిర్మిస్తున్నామని చెప్పారు. గుడికో గోమాత పేరుతో దేశ వ్యాప్తంగా ఆలయాలకు ఆవు, దూడ దానం చేసే కార్యక్రమం ప్రారంభించామన్నారు. శంకుస్థాపన పనులును త్వరలోనే పూర్తి చేసి ప్రారంభించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి పాల్గొన్నారు.