వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ను పరిశీలించిన తితిదే ఛైర్మన్ - ttd chairman vaikuntam que complex visit news
లాక్‌డౌన్ ముగిశాక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అనుమతి వచ్చే పక్షంలో భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించే విషయంపై తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధికారుతో చర్చించారు. వైకుంఠంతో పాటు శ్రీవారి ఆలయం, లడ్డూ వితరణ కేంద్రాలను ఆయన పరిశీలించారు.
![వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ను పరిశీలించిన తితిదే ఛైర్మన్ వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ను పరిశీలించిన టీటీడీ ఛైర్మన్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7382471-185-7382471-1590672226777.jpg)
తితిదే బోర్డు సమావేశానికి ముందు ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ను పరిశీలించారు. లాక్‌డౌన్ ముగిశాక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అనుమతి వచ్చే పక్షంలో భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించే విషయమై ఆయన అధికారులతో చర్చించారు. క్యూలో భౌతికదూరంతో పాటు శుభ్రతను పాటించేందుకు చేపట్టిన ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. వైకుంఠంతో పాటు శ్రీవారి ఆలయం, లడ్డూ వితరణ కేంద్రలను ఆయన పరిశీలించారు. బోర్డు సమావేశంలో చర్చించిన అనంతరం శ్రీవారి దర్శనం విధి విధానాలను ప్రకటించనున్నారు.