తిరుమలలో గదుల కేటాయింపునకు తితిదే తీసుకుంటున్న కాషన్ డిపాజిట్ పది రోజులకు కూడా భక్తుల ఖాతాలోకి చేరడం లేదు. ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్నవారికి గది ధరను బట్టి కాషన్ డిపాజిట్ తీసుకుంటున్నారు. రూ.500 నుంచి రూ.6వేల వరకున్న గదులకు అంతే మొత్తాన్ని కాషన్ డిపాజిట్‌గా వసూలు చేస్తున్నారు. రూ.50 ఉన్న గదికి కూడా రూ.500 డిపాజిట్‌గా తీసుకుంటారు. గదులను ఖాళీ చేసినప్పుడు 1,2 రోజుల్లో ఈ మొత్తం తిరిగి భక్తుడి బ్యాంకు ఖాతాలో జమవుతుందని తితిదే సిబ్బంది చెబుతున్నా... కొంతమందికి పది రోజులకుపైగా సమయం పడుతోంది. దీనిపై అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి గత నెల సంబంధిత అధికారులతో సమావేశమై సిబ్బందిని అప్రమత్తం చేసినప్పటికీ ఇంకా వేగవంతం కాలేదు. కాషన్ డిపాజిట్ సకాలంలో జమ కానట్లయితే తితిదే వెబ్‌సైట్ cdmcttd@tirumala.org కి కానీ తితిదే టోల్‌ఫ్రీ నంబరుకుగానీ ఫిర్యాదు చేయవచ్చని చీఫ్ ఇన్ఫర్మేషన్ అధికారి సందీప్ సూచించారు. 3,4 రోజుల్లోనే కాషన్ డిపాజిట్ ఖాతాల్లో జమవుతోందని తెలిపారు.
ttd rooms: తిరుమల గదుల కాషన్ డిపాజిట్ చెల్లింపు ఆలస్యం - Ttd caution deposit latest news
తిరుమల తిరుపతి దేవస్థానంలో గదుల కేటాయింపుకు తితిదే తీసుకుంటున్న కాషన్ డిపాజిట్ చెల్లింపు ఆలస్యం అవుతుంది. 1,2 రోజుల్లో భక్తుల ఖాతలో జమవుతుందని అధికారులు చెబుతున్నా... కొంత మందికి పది రోజులపైనే సమయం పడుతోంది. ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్నవారికి గది ధరను బట్టి కాషన్ డిపాజిట్ తీసుకుంటున్నారు. రూ.500 నుంచి రూ.6వేల వరకున్న గదులకు అంతే మొత్తాన్ని కాషన్ డిపాజిట్‌గా వసూలు చేస్తున్నారు.
ttd