తిరుమల శ్రీవారి సర్వదర్శనం టోకెన్లు జారీ - తిరుమల టికెట్లు
20:46 February 20
రోజుకు 15 వేల టోకెన్లు చొప్పున జారీ చేస్తున్నాం: తితిదే
tirumala sarva darshan tickets: తిరుమల శ్రీవారి దర్శనం కోసం తిరుపతిలో ఆఫ్‌లైన్ ద్వారా రోజుకు 15 వేల సర్వ దర్శనం టోకెన్లు జారీ చేస్తున్న విషయం తెసిందే. ఇవాళ (20వ తేదీ) టోకెన్ పొందిన భక్తులకు.. ఈనెల 24న దర్శనం సమయం లభిస్తోంది. మరోవైపు ఇవాళ్టి తేదీకి సంబంధించిన సర్వదర్శనం టోకెన్లు జారీ చేశారు. ప్రస్తుతం జారీ చేసిన టోకెన్లు పొందిన వారు నాలుగు రోజుల పాటు దర్శనం కోసం వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో టోకెన్ల జారీ సమాచారం తెలుసుకుని అందుకు అనుగుణంగా ఏర్పాటు చేసుకుని భక్తులు తిరుపతికి రావాలని తితిదే విజ్ఞప్తి చేస్తోంది. సమాచారం తెలుసుకోకుండా తిరుపతికి వచ్చి ఇబ్బందులు పడొద్దని కోరింది.
ఇదీ చదవండి: