తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుల సంఖ్య పెంపు ఆర్డినెన్స్‌కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. తితిదే బోర్డు సభ్యుల సంఖ్య 16 నుంచి 25కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఎక్స్ అఫీషియో సభ్యులుగా మరో నలుగురికి తితిదే ధర్మకర్తల మండలిలో అవకాశం కల్పించింది. గతంలో ఎక్స్ అఫీషియో సభ్యులతో కలుపుకుని 19 మందితో తితిదే ధర్మకర్తల మండలి ఉండేది. ప్రభుత్వ నిర్ణయంతో తితిదే ధర్మకర్తల మండలి సభ్యుల సంఖ్య 29కి చేరనుంది. ఆర్డినెన్స్‌కు గవర్నర్ ఆమోదం తర్వాత తితిదే నూతన ధర్మకర్తల మండలి కొలువుదీరనుంది. ఇటీవలే తుడా ఛైర్మన్‌కు తితిదే ధర్మకర్తల మండలిలో ఎక్స్ అఫీషియో సభ్యుడి హోదా కల్పించారు. తుడా ఛైర్మన్‌కు ఎక్స్ అఫీషియో సభ్యుడి హోదా కల్పిస్తూ ప్రభుత్వం చట్టం చేసింది.
తితిదే బోర్డు సభ్యుల సంఖ్య పెంపునకు మంత్రివర్గం ఆమోదం - hiked
తితిదే ధర్మకర్తల మండలి సభ్యుల సంఖ్యను 16 నుంచి 25కు పెంచుతూ ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. మంత్రివర్గ సమావేశంలో బోర్డు సభ్యుల సంఖ్య పెంపుపై చర్చించారు. ఎక్స్ అఫీషియో సభ్యులుగా మరో నలుగురికి ధర్మకర్తల మండలిలో అవకాశం కల్పించనున్నారు.
తితిదే బోర్డు సభ్యుల సంఖ్య పెంపునకు మంత్రి వర్గం ఆమోదం