తితిదే కొత్త పాలకమండలి తొలి సమావేశంలో కీలక నిర్ణయాలు - undefined
తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన తొలి సమావేశం నిర్వహించారు. అమరావతిలో శ్రీవారి ఆలయ నిర్మాణం నిధుల కుదింపుపై చర్చించారు. భేటీలో దేవస్థానం ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణపై కమిటీ ఏర్పాటు చేయాలని ధర్మకర్తల మండలి నిర్ణయించింది.
తిరుమల తిరుపతి దేవస్థానం ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణపై కమిటీ ఏర్పాటు చేయాలని ధర్మకర్తల మండలి నిర్ణయించింది. అమరావతిలో శ్రీవారి ఆలయ నిర్మాణ పరిధి తగ్గిస్తూ బోర్డు తీర్మానించిందని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. గతంలో 2 విడతల్లో 150 కోట్ల రూపాయలతో ఆలయాన్ని నిర్మించాలన్న నిర్ణయాన్ని సవరించారు. 36 కోట్లతో ఆలయాన్ని నిర్మించాలని నిర్ణయించారు. దేవస్థానం ముఖ్య ఆర్థిక గణాంక అధికారిగా రవిప్రసాద్‌ను నియమించారు. బోర్డు సభ్యులు మాదిరిగానే ప్రత్యేక ఆహ్వానితుల చేత ప్రమాణం చేయించాలని బోర్డు తీర్మానించింది.
TAGGED:
ttd board meeting