ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఈసారి ఏకాంతంగానే శ్రీవారి బ్రహ్మోత్సవాలు: తితిదే - తితిదే ధర్మకర్తల మండలి సమావేశం

ఈ ఏడాది అధికమాసం కారణంగా రెండు బ్రహ్మోత్సవాలు వచ్చాయని.. సెప్టెంబర్, అక్టోబర్​లో నిర్వహిస్తామని తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

ttd board meeting in tirumala
తితిదే ధర్మకర్తల మండలి సమావేశం

By

Published : Aug 28, 2020, 3:53 PM IST

సెప్టెంబర్ 19 నుంచి 28 వరకు ఆలయంలో ఏకాంతంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. కరోనా కారణంగా మాఢ వీధుల్లో వాహన సేవలు నిర్వహించలేమన్నారు. కొవిడ్ ప్రభావం తగ్గితే అక్టోబర్​లో మాఢవీధుల్లో ఉత్సవాలు జరుపుతామని వెల్లడించారు.

తిరుపతిలో రేపటినుంచి సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. బర్డ్ ఆస్పత్రిలో నూతన గదుల నిర్మాణానికి రూ.5.5 కోట్లు.. విశాఖలోని ఆలయానికి రహదారి కోసం రూ.4.5 కోట్లు మంజూరు చేశారు. తితిదే ఉద్యోగులకు ఆరోగ్యశ్రీ వర్తింపజేయాలని ప్రభుత్వానికి లేఖ రాసినట్లు చెప్పారు. కరోనా బారిన పడిన తితిదే ఉద్యోగుల వైద్య ఖర్చులు తితిదే భరించాలని నిర్ణయించారు.

తిరుమలలో వ్యర్థ పదార్థాల నిర్వహణకు ఆధునిక పద్ధతుల కోసం విరాళాలు సేకరించనున్నట్లు వివరించారు. తితిదే బోర్డు మెంబర్ సుధానారాయణ మూర్తి రూ.కోటి విరాళం ఇచ్చారని తెలిపారు. గో సంరక్షణకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. ప్రతి ఆలయానికి ఒక ఆవు ఇవ్వాలని సమావేశంలో చర్చించామని.. ఈ అంశంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. బ్యాంకుల్లో స్వామివారి విరాళాల డిపాజిట్ విధానాలు మార్చాలని నిర్ణయించినట్లు స్పష్టం చేశారు.

ఇవీ చదవండి..

డ్వాక్రా మహిళలకు తీపి కబురు.. నాలుగు విడతలుగా రుణాల మాఫీ

ABOUT THE AUTHOR

...view details